|   |   |   |   |   |   |   | 
 

రచయితలకు సూచనలు:

పాఠక మహాశయులకు మరియు రచయితలకు హంసిని సాదర ఆహ్వానం!!

తెలుగుతల్లి సేవలో తరిస్తూ తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపచేయటానికి కంకణం కట్టుకున్న తెలుగు కవులందరికీ హంసిని వందనాలు. తెలుగు భాషపట్ల ప్రజల్లో మమకారాన్ని పెంపొందింపజేసేందుకు మరియు తెలుగు సాహిత్యాన్ని అందరికి అందుబాటులో ఉంచడానికి చంద్రునికో నూలుపోగులాగా హంసిని చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నానికి మీలాంటి తెలుగు పాఠకుల/రచయితల సహకారం కావాలి. హంసినిని తెలుగువారందరికీ నచ్చే వెబ్ పత్రికగా తీసుకురావాలని మా ప్రయత్నం. హంసిని వెబ్ పత్రికను విజయవంతంగా నడపడానికి మీలాంటి రచయితలంతా మాకు సాయం చేయాలి. మీ రచనలే మా హంసినికి వూపిరి. మీ సహయ సహకారాలు లేకుండా అది సాధ్యం కాదు కాబట్టి, మీరు మీ రచనలని యెక్కువ సంఖ్యలో మాకు వీలయినంత త్వరగా అందచేస్తూ మీ హంసినిని సజీవంగా ఉంచుతారని ఆశిస్తూ , హంసినికి మీ రచనలు ఎలా పంపించాలో ఈ క్రింద సూచనలు ఇస్తున్నాము.

 
రచనలు పంపే పద్ధతి:
  • మీ కవిత/వ్యాసం/కథ ఇలా యే రచన అయినా యూనికోడ్ లో గాని లేదా RTS లో గాని టైప్ చేసి హంసినికి ( hamsini@andhraheadlines.com ) ఈమెయిలు ద్వారా పంపగలరు. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు.
  • యూనికోడులో ఎలా టైపు చేయాలో తెలియని వారి కోసం తెలుగులో టైపు చేయడానికి సహాయపడే కొన్ని పరికరాలు ఇక్కడ పొందు పరుస్తున్నాం.
  • ఒకవేళ మీకు యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపగలరు. PDFలో పంపితే మేము మొత్తం మళ్లీ టైప్ చేసుకోవాల్సి వస్తుందన్న విషయం దృష్టిలో ఉంచుకొని దయచేసి వీలైనంత వరకు RTS లేదా యూనికోడ్ లో పంపించగలరని కోరుతున్నాం.
 

మరికొన్ని ముఖ్య గమనికలు:

  • గతంలో ప్రచురించబడిన, లేదా ప్రచురణకు పరిశీలనలో ఉన్న రచనలు హంసినిలో ప్రచురించబడవు.
  • వెబ్ పత్రికలలో గాని   స్వంత బ్లాగులలో గాని ప్రచురించబడిన రచనలు కూడా హంసినిలో ప్రచురించబడవు.
  • రచనలు తమ స్వంతమనీ, గతంలో ఎక్కడా ప్రచురించ లేదనీ, వేరే పత్రికల వద్ద పరిశీలనకు లేవనీ రచయితలు హంసినికి హామీ ఇవ్వాలి.
  • రచనలను ప్రచురణకు స్వీకరించే విషయంలో తుది నిర్ణయం హంసిని సంపాదకులదే.
  • హంసినిలో ప్రచురింపబడిన రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. అయితే, రచయితలు తమ రచనలను వేరే వెబ్‌సైట్‌లలో గాని అచ్చుపత్రికలు మరియు ఇతర సంకలనాలలో గాని తిరిగి ప్రచురింపదల్చుకునే ముందు హంసిని సంపాదకులను సంప్రదించాలి.
  • రచయితలు తమ రచనలతో పాటు ఈ క్రింది సూచనను కూడా జతపరచాలి:

"ఈ రచన పూర్తిగా నా స్వంతమే. ఈ రచనను గతంలో ఎక్కడా ప్రచురించలేదు. ప్రచురణ కోసం వేరే ఎక్కడా ప్రస్తుతం పరిశీలనలో లేదు."  

 రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ( hamsini@andhraheadlines.com ) ఈమెయిల్ అడ్రస్‌కు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.