|
పాఠకులకూ, సాహిత్యాభిమానులకూ, నమస్సులు !
నాలుగు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఆంధ్రా హెడ్ లైన్స్ వార్తా పత్రిక ఎందరో పాఠకులను ఆకట్టుకుంటూ మీ ఆశీర్వచనాలతో ఎన్నో మెట్లు అధిరోహించింది. తాజా వార్తలతో సినిమా ముచ్చట్లతో ఇంగ్లీషులోనే కాకుండా తెలుగులోకూడా విలువైన సమాచారం అందిస్తూ అతికొద్ది సమయంలోనే ఒక మంచి తెలుగు అంతర్జాల వార్తా పత్రికగా పేరుగాంచింది. దీని వెనుక ఎంతో మంది కృషి, మరెంతో మంది పాఠకుల ప్రోత్సాహం వుంది.
ఈ రోజు మీ అందరి కోరికపై మీకు సాహిత్యాన్ని అందిచడానికి హంసిని పేరుతో మరో సాహిత్య పత్రికను మీ ముందుకు తెస్తున్నామని తెలియజేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది.
తెలుగు భాషపట్ల ప్రజల్లో మమకారాన్ని పెంపొందింపజేసేందుకు మరియు తెలుగు సాహిత్యాన్ని అందరికి అందుబాటులో ఉంచడానికి ఆంధ్రా హెడ్ లైన్స్ వార్తా పత్రికకు అనుభందంగా మేము వెలువరుస్తున్న ఈ హంసిని పత్రికను జయప్రదం చేయడానికి మీలాంటి తెలుగు పాఠకుల, రచయితల సహకారం ఎంతైనా కావాలి. హంసినిని మీకు నచ్చే మీరు మెచ్చే వెబ్ పత్రికగా తీసుకురావాలని మా ప్రయత్నం. ప్రతీ రోజు యెదో ఒక కొత్త రచనతో హంసినిని అప్ డేట్ చేస్తూ తాజాగా ఉంచడానికి మా సాయశక్తులా కృషి చేస్తాము.
మీ అభిప్రాయాలు, స్పందనలు, సలహాలు మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, మీ రచనలను మాకు పంపిస్తూ హంసినికి ఊపిరి పోయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం! మీ అభిప్రాయాలను తెలియజేయడానికి hamsini@andhraheadlines.com కు ఈమెయిల్ పంపించగలరని మనవి.
తెలుగుతల్లి సేవలో తరిద్దాం, తెలుగు సాహిత్యాన్ని దశదిశలా వ్యాపింపజేద్దాం!
మీ
హంసిని (ఆంధ్రా హెడ్ లైన్స్)
|