|
 |
|
 |
|
|
ఈ (జనవరి) సంచికలో:
1. ఆపరేషన్ గ్రీన్ హంట్ (సీరియల్) - భోగేల
2. ఎనభై వసంతాల తెలుగు టాకీ చరిత్ర - మొదటి భాగం (వ్యాసం) - 'సినీ విజ్ఞాన విశారద' ఎస్.వి.రామారావు
3. ఈ నెల కొత్త పుస్తకాలు - సంపాదకులు
4. ఆమె.. నేనూ.. (కవిత) - కేక్యూబ్ వర్మ
5. విముక్తి! (కవిత) - రవి వీరెల్లి
6. విలువ (కధానిక) - హరిప్రియ నోరి
బుడిబుడి అడుగులేస్తూ చూస్తుండగానే మన హంసిని మాస పత్రిక మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. |
| పూర్తిగా ... |
|
|
|
|
|
|
|
|
 |
|
|
భారత దేశ ప్రధాని ఆరేళ్ల క్రితం మావోయిజం గురించి ఒక ప్రకటన చేసారు. ఇంత వరకు ఇండియా లో కనీవినీ ఎరుగనట్టి ముసలం, అంతర్గత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఒకే ఒక అతి పెద్ద సవాలు తలెత్తిందని. చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ అడవుల్లో దాదాపు ఎనభై మంది సి.ఆర్పీ.ఎఫ్ జవాన్లని ఏప్రిల్ 6 ,2010 నాడు ఊచకోత కోశారు మావోయిస్టులు. మావోయిజం అంటే ఏమిటి? వాళ్ల లక్ష్యం ఏమిటి?
1947 వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం వేల కొద్దీ ఎకరాలను స్వాధీన పరచుకొని అభివృద్ధి పరిచింది. ఫలితంగా వేలాది గిరిజనులు నిరాశ్రయులయి పోయారు. విశ్లేషకుల అంచనా ప్రకారం 1947 - 2004 మధ్య కాలంలో ఆరు కోట్ల జనం గూడులేని గువ్వలయి పోయారు. అమాయక అడవి బిడ్డలకి తగిన పరిహారం లభించక పోగా తినడానికి తిండి లేక , ఉండటానికి గూడు లేక , కట్టుకోవడానికి గుడ్డ లేకుండా అనాథలయి పోయారు.వాళ్లకి అడవితల్లి ఆశ్రయమిచ్చింది. |
| పూర్తిగా ... |
|
|
|
|
|
|
 |
|
|
జీవితం చాలా చిన్నది. కాని దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మనిషి తెలివిగల వానిగా పరిగణించబడతాడు. మంచితనము, పట్టుదల, దీక్ష, సేవా భావము ఉంటే సాధించ లేనిది ఏది లేదు. అందుకు ఉదాహరణయే
ఈ చిన్ని కథ. |
| పూర్తిగా ... |
|
|
|
|
"ధీరజ్! త్వరగా ఇంటికిరా..." అప్పటికి నాలుగో మెయిల్ అందుకున్నాడు ధీరజ్. తలుపులు తీస్తూనే శాంభవి, "ధీరజ్! నానమ్మను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసారట. ఇండియా నుండి అమ్మ ఫోన్ చేసి చెప్పింది". దు:ఖంతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయివుంది. ఊహించని పరిణామం ఆమెను విపరీతమైన ఆవేదనకు గురిచేస్తున్నది.
”శాంభవీ... నువ్వు ప్రతిదానికీ అలా తల్లడిల్లిపోకు... ఈ రోజుల్లో చాలా మంది అలా పెద్దవాళ్ళను అలా వృద్ధాశ్రమాల్లో చేర్పించడం చాలా సాధారణమైపోయింది, చేయగలిగిందేం లేదు." ఆమెను మామూలుగా చేసేందుకు ప్రయత్నించాడు .
“అలా అనకు ధీరజ్, నానమ్మకు కొడుకూ, కూతురూ ఉన్నారు. మా అమ్మా మేమంతా ఉండి కూడా ఇలా జరిగిందేమిటి..... నాన్నే బ్రతికుంటే తన తల్లిని అలా వదిలేసేవారా? కనీసం అమ్మకు ఏమాత్రం బాగున్నా నాన్నమ్మను వదిలేదా? మా బాబాయి ఇలా ఎందుకు చేసాడు. ధీరజ్, నేను తట్టుకోలేకపోతున్నాను. పిన్నికి మనసెలా ఒప్పింది ?"
|
| పూర్తిగా ... |
|
|
|
|
|
|
|
|
|
|
 |
|
|
తన్హాయి - కల్పనారెంటాల
ప్రేమ ఎప్పుడూ ఓ కొత్త పదం, ఓ కొత్త భావన.కానీ ఆమె—అతను ఎప్పుడూ ఓ కొత్త సంఘర్షణ. ఈ కాలం లో అది ఇంకో సంఘర్షణ, ఇంకో భావన. మారుతున్న కాలపు కథ, మారుతున్న సంఘర్షణ కు అక్షర రూపం “ తన్హాయి”. గత ఏడాది నా బ్లాగు “ తూర్పు-పడమర” (kalpanarentala.blogspot.com) లో నేను రాసిన “ తన్హాయి” సీరియల్ సారంగ పబ్లికేషన్స్ నుంచి నవల గా ప్రచురితమై మీ ముందుకు వస్తోంది.
యమకూపం - రెంటాల గోపాలకృష్ణ
వ్యవస్థ వికృత రూపాన్ని బట్ట బయలు చేసిన క్లాసిక్ రష్యన్ నవల “ యమకూపం”. అలెక్జాందర్ కుప్రిన్ రాసిన రష్యన్ క్లాసిక్ నవల “ యమా ది పిట్” కి తెలుగు అనువాదం “ యమకూపం” ను సారంగ బుక్స్ వారు ఆన్ కోర్ సిరీస్ లో తొలి పుస్తకంగా నూతన సంవత్సర కానుకగా సాహితీ ప్రియులకు అందిస్తున్నారు. |
| పూర్తిగా ... |
|
|
|
|
|
|
 |
|
|
రచన: 'సినీ విజ్ఞాన విశారద' ఎస్.వి.రామారావు
ఈ రోజున సామాన్య ప్రజానీకానికి ముఖ్యవసరాల్లో ఒకటి 'సినిమా'. ఈ మాట 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం "పురోగమనం అంటే ముందుకు కదలిక" అని.
1869 లో భారతదేశంలోని బొంబాయి నగరంలో తొలిసారిగా లామియర్ బ్రదర్స్ ప్రతినిధులు మూకీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆర్.జి. టోర్నీ విదేశీ సాంకేతిక శాస్త్రజ్ఞుల సహాయంతో 1910 లో 'భక్త పుండరీక', 1911 లో 'రాజదర్బార్' మూకీ చిత్రాలను నిర్మించారు. ఆ టెక్నిక్ ను అధ్యయనం చేసిన దుండిరాజ్ గోవిందఫాల్కే దర్శకత్వంలో విదేశీయుల సహాయం లేకుండా స్వయంగా 'రాజాహరిశ్చంద్ర' నిర్మించి 03-05 - 1913 న విడుదల చేయగా దానికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు.ఆ మహనీయుని జ్ఞాపకార్థం భారతప్రభుత్వం చలన చిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన వారిని 'దాదాఫాల్కే' అవార్డుతో సత్కరిస్తుంది. |
| పూర్తిగా ... |
|
|
|
|
|
|
|
|
 |
|
|
ఓ చెట్టు పుట్టింది
నేనూ పుట్టాను.
*
నే పనిముట్టుగా మారి
తవ్విన చేదబావి నిండా
జ్ఞానపు ఊటలు.
బొక్కెనతో తోడి పొయ్యడమే ఇక. |
| పూర్తిగా ... |
|
|
|
|
ఎదురెదురుగా రెండు బండరాళ్ళు
ఆమె..
నేనూ...
ముందుగా ఎవరు కదిలిస్తారోనని
ఒకరికొకరు ఎదురు చూపు... |
| పూర్తిగా ... |
|
|
|
|
ఇక్కడో గులకరాయి వుండాలి!
ఎవరో విసిరేసినట్టున్నారు...
ఇక్కడో ఏటి పాయ ఒరుసుకొని పారుతూ వుండాలి!
ఎవరో మింగేసినట్టున్నారు...
ఇక్కడో వట వృక్షం పిట్టల గుంపుతో కిలకిల మంటూండేది!
ఎవరో నరికేసినట్టున్నారు...
|
| పూర్తిగా ... |
|
|
|
|
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో ప్రశంసాపత్రం పొందిన కవిత]
ఉత్సాహమో విజయ కాంక్షో
సగం దూరం నడక సాగాక
అలసటో అపజయమో
అడుగు పడక నిలిచిపోయాక...
కనురెప్పల కొసల కాచుకున్న
కోటి కలల కవ్వింపులకు
నడి రాతిరి నిదుర కాస్తా చెదిరిపోయిందా..
నిజమవ్వాల్సిన స్వప్నాలకై ఆపలేని ఆరాటమిక!
|
| పూర్తిగా ... |
|
|
|
|
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో ప్రశంసాపత్రం పొందిన కవిత]
నీ కోసం
నిరీక్షించి,
నిరీక్షించి,
ఆశల ఆకులు రాలిపోగా
ప్రేమానురాగాల పూలు వాడిపోగా
నేను మోడువారిన చెట్టునౌతాను
అప్పుడు నువ్వు వస్తుంటావు
|
| పూర్తిగా ... |
|
|
|
|
|