 |
|
|
|
|
| |
సూరీడు లేచాడు. భళ్లున తెల్లారింది. ఆ రోజు భారంగా నడుస్తంది కాబోలు. దినదినగండం నూరేళ్లవయుస్సులా ఉంది జీవితం. ఒకప్పుడు విపరీతమైన చలిలో, అంతకన్నా విపరీతమైన వేడిలో రాత్రుళ్లుఅడవుల్లో కిట్, గన్ తగిలించుకొని ఏజెన్సీ గుండా పోయేవాడు. అతని బూట్లు అలవోకగా కొండెక్కేవి. కామ్రేడు సురీడంటే ఆదివాసీ జనానికి బోల్డంత ఆదరణ. రాత్రిపూట ఏదైనా గూడెంలోకి వెళ్లి ఆగాల్సి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన అంబలి అమృతంలా ఉండేది. ముఖ్యంగా ఓడిషాలో మామిడి టెంకలు ఎండబెట్టి దాని గుజ్జుతో చేసిన అంబలి ఇచ్చేవారు సానుభూతి పరులు. ఎండు మిరప , ఉప్పు గడ్డతో నంజుకుని తిని అక్కడే నులక మంచం మీద వాలిపోయేవాడు. అప్పుడే పరిచయమయింది సుకాంతి . ఆమెకు తెలుగుభాష రాదు. కళ్లతో పలకరించడం వలన కాబోలు ఆమె నయనాలు ఆలుచిప్పంత అయ్యేవి . సౌందర్య దేవత శాపవశాత్తు అక్కడ గూడెంలో అవతరించిందా అన్న డౌటు కలగక పోదు. ఆనపతుంబలో సారాయి పోసేది . కాని అది తమ సిద్ధాంతానికి విరుద్ధం. |
|
| పూర్తిగా ... |
|
|
|
| |
'రెవల్యూషన్ కమ్స్ త్రూ బేరెల్ ఆఫ్ గన్' అని మావో సేటుంగ్ ఏ ముహూర్తాన అన్నాడో కానీ అలా అన్న
చైనాలో ఏ మార్పు రాలేదు కానీ వచ్చింది ఇండియాలోనే. అదీ ఆంధ్రప్రదేశ్ లో మరింతగా విప్లవాగ్నులు
ఎక్కడంటే శ్రీకాకుళం వైపు చేతులు చూపాయి.పచ్చని చెట్ల మధ్య గంధకం పొగలతో ఘాటెక్కాయి.రొంగమాటి
కొండలు ఎరుపెక్కాయి.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
భారత దేశ ప్రధాని ఆరేళ్ల క్రితం మావోయిజం గురించి ఒక ప్రకటన చేసారు. ఇంత వరకు ఇండియా లో కనీవినీ ఎరుగనట్టి ముసలం, అంతర్గత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఒకే ఒక అతి పెద్ద సవాలు తలెత్తిందని. చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ అడవుల్లో దాదాపు ఎనభై మంది సి.ఆర్పీ.ఎఫ్ జవాన్లని ఏప్రిల్ 6 ,2010 నాడు ఊచకోత కోశారు మావోయిస్టులు. మావోయిజం అంటే ఏమిటి? వాళ్ల లక్ష్యం ఏమిటి?
1947 వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం వేల కొద్దీ ఎకరాలను స్వాధీన పరచుకొని అభివృద్ధి పరిచింది. ఫలితంగా వేలాది గిరిజనులు నిరాశ్రయులయి పోయారు. విశ్లేషకుల అంచనా ప్రకారం 1947 - 2004 మధ్య కాలంలో ఆరు కోట్ల జనం గూడులేని గువ్వలయి పోయారు. అమాయక అడవి బిడ్డలకి తగిన పరిహారం లభించక పోగా తినడానికి తిండి లేక , ఉండటానికి గూడు లేక , కట్టుకోవడానికి గుడ్డ లేకుండా అనాథలయి పోయారు.వాళ్లకి అడవితల్లి ఆశ్రయమిచ్చింది. |
|
| పూర్తిగా ... |
|
|
|
|