 |
|
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో ప్రశంసాపత్రం పొందిన కథానిక]
హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో, ఒక ఐ.టి కంపెనీ కాఫెటేరియా అది. రోజూ నాలుగయ్యే సరికల్లా, తాజా కాఫీ గింజల వాసనా, యాలకులు వేసి మరిగిస్తున్న తేనీరు వాసనా కలిసి, ఆ ప్రాంతమంతా కొత్త సువాసలను పరుచుకుంటాయి.
ఒకే సెక్షన్లో పని చేసే ఉద్యోగులందరూ కలిసి, గుంపుగా రావడం, కాఫీ లేదా టీ వంకతో ఒక గంట సేపు అక్కడ కబుర్లు చెప్పుకుని తిరిగి పని కోసం బద్దకంగా కదలడం, అక్కడ ప్రతి రోజూ కనపడే దృశ్యం. |
|
| పూర్తిగా ... |
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో రెండవ బహుమతి పొందిన కథానిక]
జగదంబ పచ్చని పనసపండురంగులో మెరిసిపోతూ పదహారుకళలూ పుణికి పుచ్చుకుని అరచేతిమందం పొడవాటి జడని విలాసంగా ఊపుకుంటూ ఆతర్వాత మెడచుట్టూ తిప్పుకుని పొలం గట్టుమీంచి వయ్యారంగా అడుగులు వేస్తోంది. కాలేజికి సెలవులిచ్చేసరికి ఆరోజే పట్నంనుంచి ఇంటికొచ్చిన తన మరదలు జగదంబను వెతుక్కుంటూ వెళ్లి పొలానికి దగ్గర్లోని జామచెట్టు చాటున దాగి జగదంబ గట్టు చివరకువచ్చి కాలిబాట పట్టగానే చటుక్కున జడ దొరక బుచ్చుకున్నాడు. ఉలిక్కిపడిన జగదంబ ముందు కెవ్వుమని తర్వాత కాశీపతిని చూసి సిగ్గు తో మెలికలు తిరిగిపోయి విదిలించుకుని పారిపోబోయింది. అయితే ఆమె జడ కాస్తా కాశీపతి చేతిలో ఇరుక్కుపోయింది. |
|
| పూర్తిగా ... |
|
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
కాలింగ్ బెల్ నొక్కాను.తలుపు తీసిన పని మనిషి పలకరింపుగా నా వేపు
చూసి సూట్ కేస్ ఇంట్లోకి తీసుకెళ్ళింది. లోపలికి అడుగుపెట్టి హాల్లో నిలబడ్డాను
పది నిమిషాల తర్వాత ఆమె వస్తున్న సడి. పాంజేబుల సవ్వడి...హంసనడక...
చిరునవ్వు లేని మోము. కనురెప్పలెత్తబోయింది. అంత బరువు మోయలేదేమో?
సహాయం చేద్దామా? అన్నంత సొగసు. జయచంద్ర ఆఫీస్ పని మీద కేంప్ కి వెళ్తూ
నేను ఇంటికి చేరిన రెండు గంటల్లో వచ్చేస్తానని ఫోన్ చేసాడు నేను వూర్నించి
బయలుదేరేముందు. |
|
| పూర్తిగా ... |
|
|
|
| |
జీవితం చాలా చిన్నది. కాని దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మనిషి తెలివిగల వానిగా పరిగణించబడతాడు. మంచితనము, పట్టుదల, దీక్ష, సేవా భావము ఉంటే సాధించ లేనిది ఏది లేదు. అందుకు ఉదాహరణయే
ఈ చిన్ని కథ. |
|
| పూర్తిగా ... |
|
|
|
| |
"ధీరజ్! త్వరగా ఇంటికిరా..." అప్పటికి నాలుగో మెయిల్ అందుకున్నాడు ధీరజ్. తలుపులు తీస్తూనే శాంభవి, "ధీరజ్! నానమ్మను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసారట. ఇండియా నుండి అమ్మ ఫోన్ చేసి చెప్పింది". దు:ఖంతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయివుంది. ఊహించని పరిణామం ఆమెను విపరీతమైన ఆవేదనకు గురిచేస్తున్నది.
”శాంభవీ... నువ్వు ప్రతిదానికీ అలా తల్లడిల్లిపోకు... ఈ రోజుల్లో చాలా మంది అలా పెద్దవాళ్ళను అలా వృద్ధాశ్రమాల్లో చేర్పించడం చాలా సాధారణమైపోయింది, చేయగలిగిందేం లేదు." ఆమెను మామూలుగా చేసేందుకు ప్రయత్నించాడు .
“అలా అనకు ధీరజ్, నానమ్మకు కొడుకూ, కూతురూ ఉన్నారు. మా అమ్మా మేమంతా ఉండి కూడా ఇలా జరిగిందేమిటి..... నాన్నే బ్రతికుంటే తన తల్లిని అలా వదిలేసేవారా? కనీసం అమ్మకు ఏమాత్రం బాగున్నా నాన్నమ్మను వదిలేదా? మా బాబాయి ఇలా ఎందుకు చేసాడు. ధీరజ్, నేను తట్టుకోలేకపోతున్నాను. పిన్నికి మనసెలా ఒప్పింది ?"
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
ఆరోజు బాబు పుట్టిన రోజు...........
'యశోదా! నా మాట విను. ఒక్క అరగంట చూసి మనం తినేద్దాం.' వాచీ చూసుకుంటూ బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు ఫల్గుణ. జంబుఖానాను పొందికగా మడతబెట్టడం పూర్తి చేసి కోపంగా కళ్ళెత్తి చూసింది యశోద. 'చూడండి మహాశయా! మీ బాస్ గారంటే నాకేమీ పగ ద్వేషం లేవు. కానీ ఎదురు చూడడానికైనా ఒక అంతు అంటూ ఉండాలిగా! పదవుతోంది. పిలిచిన వాళ్ళంతా చక్కగా బాబు మీద అక్షింతలు వేసి వెళ్లారు. అయినా సాగర్ గారికి మరీ అంత గొప్పలు పనికిరావు. అంత తీరుబాటు లేదంటే నేను నమ్మను. నాలుగక్షింతలు వేసి ఆ తర్వాత పని చూసుకోవచ్చుగా...'
'బిజినెస్ అంటే నీకు తెలీదు యశోదా! ఒకరోజు ఖాళీగా ఉన్నామనిపిస్తుంది. ఒకోసారి ఊపిరి పీల్చడానికి కూడా తీరిక ఉండదు. లక్షల్లో వ్యవహారం. మనకిలా ఆయనకెలా కుదురుతుంది? భోజనానికి తప్పకుండా వస్తానన్నారు. నేననుకోవడం బయల్దేరుతుండగా ఏ అర్జెంటు ఫోన్ కాలయినా వచ్చిందేమోనని.' - అనునయంగా అభ్యర్థిస్తున్నట్టుంది ఫల్గుణ కంఠం.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో ప్రశంసాపత్రం పొందిన కథానిక]
సెలవులకి వచ్చిన మనవలిద్దరిని చెరో పక్కన కూర్చోబెట్టుకుంది శారదమ్మ.వెండి గిన్నెలో వేడి అన్నంలో ముద్ద పప్పు కలిపి కమ్మని నెయ్యి వేసి చిన్న ముద్దలు తినిపిస్తున్న బామ్మతో సిద్దార్థ మురిపెంగా అన్నాడు.
'బామ్మా! మేం బండి దిగి వాకిట్లోకి రాగానే మా తల చుట్టూ ఎర్రనీళ్లు తిప్పి పారబోసావుకదా ఎందుకు?'
'దిష్టి తీసానాన్నా!'
'దిష్టి అంటే ఏంటి?'
"అంటే ఏంలేదర్రా...దృష్టి..అన్నమాట...నరుడి కంట నల్లరాయైనా పగులుతుందని సామెత..అంతదూరం ప్రయాణం చేసి వచ్చారు.
ఎన్ని కళ్ళు మీమీద పడ్డాయో.. చివరకి కన్న తల్లి అయినా సరే బిడ్డ వైపు తదేక దృష్టితో చూడకూడదట మా బామ్మ చెప్పేది.తెలుసా?'
'బామ్మా..ఇది మూఢనమ్మకం కాదా?'
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో ప్రశంసాపత్రం పొందిన కథానిక]
నువ్వు ఎన్నయినా చెప్పరా, విదేశాలకెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడటమే జరుగుతోంది. అలాంటప్పుడు కోరి, రామూని దూరం చేసుకోవటమే అవుతుంది. ఆలోచించు.
పైగా ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేయ్యాల్సి వస్తుంది. ఇంటి మీద గూడా అంత లోన్ తీసుకొని పంపిస్తే ఎలా? ఏమో ,
నాకంతగా రుచించటం లేదు. ఉన్నదంతా ఊడ్చిపెడితే, రేపు మన వృద్దాప్యంలో లేనిపోని బాధలు పడాల్సివస్తుంది. అందుకే, నేను మా కృష్ణతో ఖరాఖండిగా చెప్పేసాను, నావల్ల కాదని.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
నా పేరు సన్యాసిరావు. నేనొక ఉల్లి ప్రేమికుడను. ఇదేంటి.. ఉల్లి ప్రేమికుడా?... మజ్ను అంటే లైలా ప్రేమికుడు,
దేవదాసు అంటే పార్వతి ప్రేమికుడు అని విన్నాం కాని ఇదేంటి ఉల్లి ప్రేమికుడు.. అనుకుంటున్నారా.
అయితే మీరు నా కథ చదవాల్సిందే నా కథలో నేనే హీరో. ఉల్లి నా ప్రియురాలు. అన్ని ప్రేమకథల్లాగానే నా కథలో
కూడా ఒక విలన్ ఉన్నాడు. విలన్ ఎవరు అనుకుంటున్నారా. మనిషి మాత్రం కాదు. ఎప్పుడు పెరుగుతుందో
ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని ధరలనేవాడు నా విలన్. ...
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో ప్రశంసాపత్రం పొందిన కథానిక]
ఆ రాత్రి చంద్రుడు ఏ నక్షత్రంలో సరసమాడుతున్నాడో తెలియకుండా ఉండాలనేమో నల్లమేఘాల
దుప్పటి కప్పుకున్నాడు. నిండా పదిహేనేళ్ళు లేని ఇద్దరు పసివాళ్ళు లల్లాయి పాటలు పాడుకుంటూ
రైలు పట్టాల వెంటే నడుస్తున్నారు. వాళ్ళిద్దరి భుజాన చెరో గోనెసంచి వూగుతున్నాయి. అక్కడక్కడా
మిణుగురు పురుగులు మినహాయించి మరే వెలుగూ లేదక్కడ. దూరంగా ఏదో పల్లెటూరి స్టేషన్ లో
దీపస్థంభాలు మినుకు మినుకు మంటున్నాయి. ...
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో మొదటి బహుమతి పొందిన కథానిక]
"సంజీవని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ "! సుమారు పదేళ్ళ క్రితం రంగరాయ మెడికల్ కాలేజీ నుండి బయటకు వచ్చిన టాపర్స్ అందరూ కలిసి, కాకినాడలోనే ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్, ఈ రోజు "బెస్ట్ డాక్టర్స్" అందరినీ కూడగట్టుకుని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగింది. మన దేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాక, విదేశాలలో సైతం ఇరవైకు పైగా బ్రాంచీలను ఏర్పాటు చేసి, అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు ప్రఖ్యాతలు గడిస్తోంది. ఒక్కసారి సంజీవని ద్వారా విదేశాలకు వెళితే ఐదేళ్ళ పాటు అక్కడే కన్సల్టెంట్‌గా పని చేసే అవకాశం కల్పిస్తారు. దేనికీ వెనుకాడక్కర్లేని డాలర్ల సంపాదన. ...
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో రెండవ బహుమతి పొందిన కథానిక]
చిన్నప్పుడు రామాయణాన్ని పిల్లల కథగా విన్నాను. అందులోని పాత్రల్ని దేవుళ్లుగా భావించాను. అందరు పిల్లలకూలాగే నాకూ హనుమంతుడు ఇష్టదైవం. కానీ అందరిళ్లలోలా అక్కడితో ఆ విషయాన్నలా వదిలేయడం అవలేదు. కారణం మా ఇంట్లో నాన్న ఓ రంగనాయకమ్మ, అమ్మ ఓ విశ్వనాధ సత్యనారాయణ.
అమ్మకి రామభక్తి. తనవల్ల మంచి జరిగితే రాముడి కృప అంటుంది. చెడు జరిగితే తప్పు తనదని మన్ముందు సన్మార్గాన నడిపించమని రాముణ్ణి వేడుకుంటుంది. ఆమెది మూఢభక్తి అంటారు నాన్న. ఎన్నో విషయాల్లో నాన్నని అభిమానించి ఆరాధించే అమ్మ భక్తి విషయంలో మూఢత్వాన్ని మాత్రం ఒప్పుకోక, ''నాన్నకి రాముడి గొప్పతనం తెలియక కాదు. అహం ఆయన తెలివిని కమ్మేసిందంతే'' అనేది నాతో.
నాన్న మాటల్లో తర్కం నాకు సబబుగా అనిపించేది.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
చెల్లెలి కొడుకు బారసాల రోజునే గ్రామస్థులు తనకి సన్మానం తలపెడితే- ఎమ్మెల్యే మహదేవ్ పెద్దగా సంకోచించలేదు. నామకరణం పదింటికల్లా ఐపోతే- మరో గంటలో తన ఊరు చేరుకోవచ్చనుకున్నాడు. సభలకి ఆలస్యంగా వెళ్లడం రాజకీయాల్లో రివాజే కాబట్టి ముందుగా చెప్పక్కర్లేదనుకున్నాడు. కానీ తండ్రి దామోదరం ఒప్పుకోలేదు.
దామోదరం సామాన్యుడు కాదు. స్వార్థచింతన లేని గొప్ప టీచరుగా చుట్టుపక్కల ఆయన తెచ్చుకున్న పేరు కూడా మహదేవ్ ప్రగతికి ఓ కారణం. అసలు తండ్రి ఆశయాల్ని మరింత మెరుగ్గా అమలు చేయొచ్చనే పాతికేళ్ల వయసుకే రాజకీయాల్లో ప్రవేశించాడు మహదేవ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలని- తన ఊరిని రెండు వర్గాలుగా చీల్చిన పెద్దమనుషుల మధ్య పొంతనకై ఐదేళ్లపాటు నిర్విరామకృషి చేసాడు. తన ప్రయత్నాలు ఫలించడానికి పదవి అవసరమని గ్రహించి ఎమ్మెల్యే టికెట్ సాధించి- ముప్పై ఏళ్లు నిండకుండా ఎమ్మెల్యే అయ్యాడు. త్వరలో మంత్రి కాగలడని పుకార్లున్నాయి.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో మూడవ బహుమతి పొందిన కథానిక]
రాత్రి మూడయిందేమో...భళ్ళున శబ్దానికి ఒక్క ఉదుటున లేచాను.
" సుధీర్..లేవండి... నాన్నగారి గది లోంచి వస్తోంది శబ్దం" అంది సుమ కంగారుగా.
తలుపు తీసుకొని గబగబా నాన్న రూం వైపుకు వెళ్ళాం. టాయిలెట్ లోంచి వచ్చింది శబ్దం. లైట్ లేదు లోపల. లోపలకి పరుగెత్తి చూసాను. ఫ్లష్ టాంక్ తో పాటు కింద కూర్చునిపోయి వున్నారు నాన్న. టాంక్ మూత కింద పడి ముక్కలయి వుంది. అదృష్టవశాత్తు నాన్నకేమీ కాలేదు.
"నాన్నా! ఏమయింది ?" అని మెల్లిగా నిలబెట్టాను.
" ఏమీ లేదు.." అన్నారు గొణిగినట్టుగా...
" లైట్ వేసుకోలేదే౦?" అన్నాను.
లైటా అని అయోమయంగా చూసారు... 'అదేవిటీ?' అన్నట్టు.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
తెలుగు భాష కు ప్రాచీన హోదా వచిందన్న శుభవార్త మా ఇంట్లో పెద్ద పండుగ వాతావరణాన్ని తెచ్చింది అనే చెప్పాలి. ఎందుకంటే మా ఆవిడకు దూరపు బంధువు వరుసకు తాతయ్య అవుతారులేండి. ఆయన రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగు పండితుని గా పదవీ విరమణ చేసి, ఇప్పటికీ తన పనులు తాను చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు. బామ్మ గారు లేవలేని స్థితిలో వుంటే, ఆమెను కొడుకు ఇంట్లో వుంచి, తను మాత్రం ఇలా బందువుల ఇళ్ళల్లో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. తల మీద చుట్టూ నీలుగు పోగుల జుట్టు, ఖద్దరు లాల్చీ, రెండు రంగుల అంచు ఉన్న ఖద్దరు పంచె , భుజాన్న కండువా , వీటిలో వేలాడుతున్న ఆయన శరీరం, యడమ చేతిలో నశ్యం డబ్బా, ఇదీ ఆయన స్వరూపం.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
కట్టుకున్నవాడి చిటికన వేలు పట్టుకొని మెట్టినింటికి వచ్చింది శ్వేత. హారతి పట్టి ఆత్మీయంగా లోపలికి ఆహ్వానించవలసిన వాళ్ళు ఆమడ దూరంలో నిలబడి పోయారు. శ్వేత హృదయం కలుక్కుమంది. తన రాక ఆ ఇంటిలో అందరికి అప్రియమన్న సంకేతం అందడంతో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. దూరం నుంచి చోద్యం చూస్తున్న చెల్లలు సుశీల వంక ఎర్రగా చూసాడు వంశీ.
సాటి ఆడపిల్లనన్న కనీస సానుభూతి కూడా లేదా అన్నట్లు ఉన్నాయి అతడి చూపులు. శ్వేత తల్లి సత్యవతమ్మకి వాళ్ళ ప్రవర్తన మింగుడు పడటం లేదు, పిల్లని ఇష్టపడి చేసుకున్నారు ఉన్నంతలో వాళ్ళ కోరికలన్నీ తీర్చింది. మరి ఎందుకు ఈ అలకలు ?... ఇంకా దేనికి పెదవి విరుపులు ?... ఎవరి ప్రేమేయం లేకుండానే లోపలికి అడుగు పెట్టారు వంశీ దంపతులు. కూతురి కంట్లో నీళ్ళు చూడలేక వచ్చిన రోజే తిరుగు ప్రయాణానికి సిద్దం అయ్యింది సత్యవతమ్మ. అయినా ఎవరు ఆమెను ఉండమని వొత్తిడి చెయ్యలేదు.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
సాయంకాలం బడి నుండి ఇంటికొచ్చిన పరమేశ్వరి కాసింత అల్ఫాహారం కానిచ్చి, పుస్తకాలూ ముందేసుకుంది.
అది చూచి వాళ్ళ పితామహి, ట్యూషన్ కేల్లవా? అంటూ ప్రశ్నించింది.
మా మేడం, శోభనానికెల్లింది అంది పరమేశ్వరి శోభనానికా ఇదేం విడ్డురమే అలాగే చెప్పిందా? అంటూ డెబ్భై ఐదేండ్ల కామాక్షమ్మ ముక్కున వేలేసుకుంది.
అవును, లీవ్ లెటర్ లో అలాగే రాసిందట... అంది పరమేశ్వరి.
"ఓ పంతులమ్మ ఏమిటి? అంత పచ్చిగా రాయడమేమిటి! ఇదేం పోయేకాలం? అంటూ అమితాశ్చర్యాన్ని ప్రకటించింది కామాక్షమ్మ.
"ఈ వారమంతా మా స్కూల్లో... తప్పు.. తప్పు... మా పాఠశాలలో అందరూ తెలుగులోనే మాట్లాడాలట. తెలుగులోనే రాయాలట మృతభాషా వారోత్సవాలు జరుగుతున్నాయి కదా! అందుకోసం" అంది పరమేశ్వరి.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
రచయిత రాము సమాజాన్ని ఔపాసన పట్టేసాడు. కథ రాసాడంటే కథ ఆద్యంతం చదివింపచేస్తుంది. సమాజాన్ని వేలెత్తి చూపుతుంది. మన కళ్ళముందు జరుగుతుంది ఇదే అని చదివేరీడర్ గొప్పగా రాసాడని ఒక్కసారి కథనాన్ని రిపీట్ చేస్తాడు. అదే రాము కథల్లో గొప్పతనం. అలా అని నిత్యం అన్ని పత్రికల్లో విపరీతంగా రాసేసిన కథకుడు అంతకంటే కాడు. ఏ ఆరు మాసాలకో ఒక కథ రాస్తాడు. దాన్ని అచ్చువేయంది ఆ పత్రిక నిద్రపోదు.
అది రాములో రచయిత కథ.
రాము వయస్సు 75 ఏళ్ళు. భార్య ఇద్దరు పిల్లలు ఏవో రోగాలు రోష్టులతో చనిపోయి చాలా కాలమయ్యింది. తానే వండుకొని తింటూ చిన్న అద్దె ఇల్లులో ముప్పయ్ ఏళ్ళుగా ఒంటరి జీవితాన్ని అనుభవించాడు. తనకంటూ ఎవరూలేరు. కడుపు నింపుకోవడానికి ఎదుగు బొదుగులేని పాన్ షాప్ నడుపుతూ కాలాక్షేపం చేస్తుండేవాడు.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
నిన్న ఇదే వేళకు, కనుమరుగవుతోన్న మలిపొద్దును చూస్తున్నాడు, ముత్యాల నాయుడు.
పొడిచే తొలి పొద్దునూ, మలిగే మలిపొద్దునూ జీవితంలో చాలా సార్లు చూసేడు. వాన ముసురులో వేకువజారిన వేళ పూరిళ్ళ వాసల ముంజూర్లలో, పచ్చ పచ్చని చేల మీదా చేల గట్ల మీదా నాగావలి నది కెరటాల మీద తొనికిసలాడే తడి తడి పొద్దుపొడుపును చూసేడు. శీతగాలులేవో వీచగా మోరలెత్తి అరచే లేగ దూడల గంగడోలుల మీదా, రెక్కలు గొట్టుకు గూళ్ళకు ఎగిరే పక్షి రాశుల రంగుల రెక్కల మీదా, వరికంకుల మీదా మేత మేసే మేఘాలు వాలే కొండల మీదా, కోనల మీదా జారిపోయే సువర్ణ కిరణాల మలిపొద్దును చూసేడు. కొన్నిసార్లు యీ దృశ్యాలు యీ జీవితంలో దర్శనమైన అపురూప దృశ్యాలనందించాయి! కొన్నిసార్లు యే అనుభూతినీ కలిగించని రోజువారి దృశ్యాలనిపించాయి.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
పూర్వం బలభద్రపురం అనే ఊళ్ళో వివేకప్రతాపుడనే యువకుడు సుగంధద్రవ్యాల వ్యాపారం చేస్తుండేవాడు. అతని తల్లీ తండ్రీ కాశీకి ప్రయాణమై మార్గ మధ్యలో హత్య చేయబడ్డారు. అప్పట్నుంచ్చీ మేనమామ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. మేనమామ పేరు జనార్ధనుడు అంతా అతనిని ధనార్జనుడు అని పిలుస్తుండేవారు. ఎవరన్నా బాగుంటే ఓర్వలేని గుణం అతనిది. జనార్ధనుడి ఇంటి ప్రక్క జాగాలో తండ్రి పాత ఇంట్లోనే ప్రతాపుడు మేనమామ పర్యవేక్షణలో వ్యాపారం చేసేవాడు. రాను రాను జనార్ధనుడి స్వార్థబుద్ధి ప్రతాపుడికి తెలిసి వచ్చింది. ...
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
"హాస్య రచన చేయడమంటే మాటలు కాదోయ్ . ఇప్పుడు వచ్హే హాస్య రచనలు చదివేటప్పుడు పక్కన ఎవరైనా ఉండి గిలిగింతలు పెట్టాల్సిందే అంత రుణంగా ఉంటున్నాయి నేటి కామెడీ రచనలు," అంటూ నవ్వేస్తున్నాడు వి.కే.మార్క్ .
"నిజమేననుకో .మరి ఇంత బాగా చాలా రచనలు చేస్తున్నవ్ కదా. ఒక్కటి కుడా ఏ పత్రికలోనూ ప్రచురింప బడకపోవడంలో రహస్యం ఏమిటంటావ్ ? అన్నాడు ఎప్పుడు మార్క్ ఇంటికి వచ్హే సుబ్బారావు . అతను మార్క్ కి చిన్ననాటి స్నేహితుడు. తన మిత్రుడు ఎప్పటికైనా గొప్ప రచయిత అయితే వాడూ నేను బాల్య మిత్రులం అని గొప్పగా చెప్పుకోవచ్చని పాపం సుబ్బారావు కోరిక.
"చూడవోయ్, నా రచన ప్రచురించడం వలన ఆ పత్రిక సర్కులేషన్ విపరీతంగా పెరుగుతుంది అంతే కాకుండ పాఠకుల మెయిల్ కూడా అధికమవుతుంది.ఇది వాళ్లు గ్రహించక పోవడం దురదృష్టకరం. కానీ చూడు సుబ్బూ నేను ఎప్పటికైనా నెంబర్-1 రైటెర్ ని అవుతాను -" అన్నాడు వి.కే. మార్క్ . ...
|
|
| పూర్తిగా ... |
|
|
|
|