|   |   |   |   |   |   |   | 
ఈ సంచికలో..
ఆనందరావు పట్నాయక్,  08-06-2014

ఈ సంచికలో...
1.  ఆపరేషన్ గ్రీన్ హంట్ (సీరియల్) - 20వ భాగం - భోగెల
2.  అనుభవాలు + జ్ఞాపకాలు = మధురస్ర్ముతులు - పోలాప్రగడ జనార్ధనరావు (జెన్ని)
3.  సంపాదకీయం - ఆనందరావు పట్నాయక్
4.  లాస్య లహరి -  పి.వి శేషారత్నం
5.  దేవతార్చన - కె.బి.కృష్ణ
6.  గ్రంధ సమీక్ష  -  ఆనందరావు పట్నాయక్

తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్రావు ప్రమాణస్వీకారం చేశారు.దశాబ్దాల పోరాట ఉద్యమం విజయవంతమైంది.
పూర్తిగా ...
ఆపరేషన్ గ్రీన్ హంట్ (సీరియల్) - 20వ భాగం
భోగెల,  08-06-2014

పగలు పది కావస్తోంది . హైస్కూలు ఆవరణలోని స్టూడెంట్సు , గుమిగూడి ఉన్నారు . అందరి దృష్టి దూలానికి
కట్టిన ఉరి తాడుమీద ఉంది . దాని ముందు స్టూలు మీద నిలబడి ఉన్నాడు ఒక కుర్రాడు . తనకు న్యాయం
జరక్కపోతే అక్కడే , అప్పుడే ఉరి పోసుకుని చనిపోతానంటున్నాడు వాడు . ఎవరైనా అతని రక్షించడానికి
ముందుకు వస్తే తక్షణమే అది అమలులో పెట్టి ఆత్మహత్య చేసుకొంటానన్నాడు . అక్కడున్న జనానికి , స్కూలు
పిల్లలకి ఏమి చెయ్యాలలో పాలు పోవడం లేదు .
       అంతలో హైస్కూలు హెడ్మాస్టరు వచ్చాడు . సంగతేమిటని అనునయించి కుర్రాడిని అడిగాడు .
హెడ్మాస్టరు సంప్రదాయవాది కాడు . ఖచ్చితమైన మనిషిని మ్యానేజిమెంటు అతన్ని ఈ ఊరు బదిలీ చేసారు.
అతనికీ ఆకుర్రాడంత కొడుకు ఉన్నాడు . ఇద్దరికిద్దరు తెలివైన వాళ్లే . కర్ర విరగకూడదు . పాము చావరాదు .
న్యాయం జరగాలి అది అందరిలో నాటుకు పోయేటట్లు ఉండాలి .
పూర్తిగా ...
దేవతార్చన
కె.బి.కృష్ణ ,  08-06-2014

 సమాజం లో ప్రతీ తల్లీ తండ్రీ తమ సంతానాన్ని వృద్ధి లోకి తీసుకు వచ్చాక వాళ్ళు
సిరిసంపదలతో తులతూగే సమయం లో తమ ను తమ సంతానం గుర్తు పెట్టుకుని ఏదో
చేయాలని అనుకుంటూంటారు . ఇది మంచి ఆలోచన కాదు .    
        ప్రతీ రోజూ స్నానం పూజానంతరం , భగవద్గీత పారాయణం చేయడం నాకు అలవాటు . భగవద్గీత
లోని ప్రతీ శ్లోకం లోనూ ఒక జీవిత సత్యం ఇమిడి ఉంటుంది . రోజూ ఏకాగ్రత తో చదవగలిగినన్ని శ్లోకాలు
చదివి , పూర్తి అయ్యాక మరలా మొదటి నుండీ చదువుతాను . ఇది చాలా సంవత్సరాల నుండి నాకు
అలవాటు గా అయిపోయింది . ముఖ్యం గా భగవద్గీత లోని కర్మయోగం, జ్ఞానయోగం , శ్రద్ధగా  చదివి అర్ధం
చేసుకుంటే ఆ మనిషికి ఎటువంటి బాధలు ఉండవని నా నిశ్చితాభిప్రాయం .
పూర్తిగా ...

లాస్య లహరి
పి.వి శేషారత్నం,  08-06-2014

గబగబా ఐదేళ్ళ లాస్యకి చకచకా తలదువ్వి యునిఫారం వేసేసింది సకల .
"లాస్యా త్వరగా టిఫిను తినెయ్ . టైమయిపోతోంది ."
ఇంకా నిద్రమత్తు వదలని లాస్య టిఫిన్ తినకుండా ప్లేటు తోసేసింది .
'వద్దు .'
'లాస్యా ! నిన్ను బతిమాలేందుకు టైములేదే . త్వరగా తిను . '
లాస్యతో మాట్లాడుతూనే సకల, తనకీ, భర్త శ్రీహరికీ కూతురు లాస్యకీ లంచ్ బాక్సులు సిద్ధం చేసేసింది .
'ఆకలేయ్యడంలేదమ్మా !' ప్లేటు పక్కకి తోసేసింది లాస్య .
వాళ్లిద్దరినీ ఓరగా గమనిస్తూనే మరోవైపు శ్రీహరి తను తయారయిపోయి చివరిగా బూట్లకు లేసులు కట్టుకుంటూ సకలని పిలిచాడు చిరాకుగా .
'సకలా ! రెడీ అయ్యావా లేదా ? మీ ఆడాళ్ళు ఓ పట్టాన తెమలరు కదా!'
పూర్తిగా ...

ఆపిల్ పండూ - ఆడమ్
బాలాదేవి పింగళి,  10-02-2014
భోజనాల ముందే ఆరాత్రి తను తెచ్చిన నెమలి కంఠం రంగు జరీ అంచు నేత చీరా , చీరకు సరిపడా రంగులో గౌరికి సైజయిన జాకట్టూ గౌరి చేతిలో పెట్టాడు గంగరాజు ప్రేమతో . మర్నాడు పెళ్లిరోజుకు ఆమె అది కట్టుకోవాలనీ ,సాయంత్రం రిషే  తొక్కడానికి వెళ్లాననీ , ఇద్దరూ కలసి సినిమాకి  వెళ్దామని కూడా చెప్పాడు. ఆ మాటలు విన్న ఆమె మనస్సు ఒక్కసారిగా ఎక్కడో మబ్బుల్లో తెలిపోతున్నట్లుగా ఊపించుకుండా ఎంతో ముచ్చటగా కనిపిస్తున్న ఆచీరా జాకట్టూ గుండెలకి హత్తుకుంది
ప్రేమనిండిన కళ్లలో అతని వైపే చూస్తూ ఉండిపోయింది . ఎంతోసేపు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు గంగరాజు .
పూర్తిగా ...
సదా నీ ఊహల్లో...
సి.వి.సురేష్,  19-01-2014
అనుక్షణం నీకై నిరీక్షిస్తున్న నేను నా అంతరంగాన్ని ఇలా ఈ ప్రేమలేఖ ద్వారా చెప్తున్నాను. నా (నీ) ప్రేమ నన్నెలా చుట్టేసిందో...ఎలా బాధపెడుతోందో..నీ జ్ఞాపకాలు ఏ అనుభూతిని మిగిల్చాయో..నన్నెలా సంతోషాని కి గురిచేసిందో నేనెలా ఫీల్ అయ్యానో ఈ ప్రెమాక్షరాలే అందుకు నిదర్శనం. అవే ఈ లేఖకు జీవం.
పూర్తిగా ...
అనుభవాలు + జ్ఞాపకాలు = మధురస్ర్ముతులు
పోలాప్రగడ జనార్ధనరావు ,  08-06-2014

 చతుశ్చక్ర శకట నివాస స్థానం అంటే ఎంత
మంది  తెలుగు వాళ్ళకి తెలుస్తుంది .
            దాన్నే 'బస్టాండ్ ' అంటాడంటే ఓహో మరి అలా
చెప్పవేం అంటారు . [ పై మాట జంధ్యాలగారు రాసింది .]
                    అలాగే
     జంధ్యాల దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి అంటే ఎవరు ? అని
అడిగితే,ఎవరని ? ఎదురు ప్రశ్నవేస్తారు . ఆయనే హాస్య బ్రహ్మ
సినీ దర్శకుడు , రచయిత జంధ్యాలంటే మాకెందుకు  తెలియదంటారు
(జంధ్యాల 14-1-1951 లో నర్సాపురం . పశ్చీమ గోదావరి జిల్లాలలో పుట్టాడు )
పూర్తిగా ...
గ్రంధ సమీక్ష
ఆనందరావు పట్నాయక్,  08-06-2014

అమిష్ త్రిఫాఠి ఫక్తు హిందూ రచయిత.మనకి బాగా తెలిసిన సత్యమని నమ్మే పురాణ విశ్వాసాలను, సమాజ సిధ్దాంతాలను అన్వయించి గ్రంథస్తం చేసారు.ఈ పుస్తకం జానపదం, కాల్పనికత,మతం, పురాతత్త్వ వస్తు సత్యాలను మేళవించి అరుదైన సత్యాలను వెలుగులోకి తేడానికి చేసిన ప్రయత్నం హర్షదాయకం.
పూర్తిగా ...
గాలిపటాలనెగరేద్దాం పదండి!
వారణాసి నాగలక్ష్మి,  19-12-2013

ఒక ఆలోచన గాలి పటమై
మనోవీధిని విహరిస్తుంది
అంతుచిక్కని దారుల్లో
వింతగా చరిస్తుంది !
పట్టుకున్న చేతులనించీ
తనను పట్టిఉంచే దారాన్ని లాక్కుంటూ
దూరదూరంగా సాగి పోతుంది
పూర్తిగా ...

కాలం ఓ ఫీనిక్స్
అయినంపూడి శ్రీలక్ష్మి,  03-11-2013


కాల చక్రం ఓ అలుపెరగని దేశ దిమ్మరి
ముఖం చెట్టుపై చిగురించిన చిర్నవ్వు పూలను
కంటి  మేఘం కురిపించిన కన్నీళ్ళ వర్షాన్ని
జనారణ్యంలో ఉద్యమ పులి చేసిన గర్జనలను
ఎర్ర కోట నీడల్లో తడిసిన గుండెల దీపం వెలిగించిన కాంతులను
ఈ క్షణాన ఆగి ఒక్కసారి మననం చేస్కుంటోంది
పూర్తిగా ...

నాగరిక దుఃఖం
గరిమెళ్ళ నాగేశ్వర రావు ,  05-08-2013

హైదరాబాద్ నగరం మధ్యలోపూసిన
గుల్ మొహార్ పూల మొక్క లా దిల్ మురిపించేది.
దిల్ సుఖ్ నగర్..
బ్రతుకుని వెదుక్కుంటూ ఆశ తీసేశ్వాసలా
ఇక్కడ గాలి స్వప్నాలను వీచేది.
అక్షరాల దారిలో లక్షలాది పుష్పాలు
వికసించినవిజాఞన సరోవరంలా విద్యలనందించేది.
విరామమెరుగని జీవనపోరాటానికి
నిత్యం పురుడు పోసే “యంత్రసాని తనం”దీనిది.
పాదాల్ని తొడుక్కుని కాలంతో పోటీ పడుతూ పరుగులు పెట్టే రోడ్డు
నెత్తురోడుతూన్న మాంస ఖండాలుగా చీలి చిద్రమయ్యింది.
పూర్తిగా ...

ఊరు బతుక బోతాంది...!
మామిడి హరికృష్ణ,  05-08-2013

పచ్చని పొలాలు - తీరొక్క పంటలు
యేరు వాక పున్నాలు - బైటి వంటలు
గొబ్బెమ్మలు - దసరా పిల్ల నెత్తురు బొట్లు
మచ్చ గిరి సామి గుడి కాడ గణపయ్య మట్టి బొమ్మలు
తాళ్ళ కుంట చెర్వు కాడ బతుకమ్మ ఆటలు
పెద్ద బడి మైదానం ల సాధనా సురుల మాయలు
అమాస బజార్ లల్ల  దీపాల ముసి ముసి యెలుగులు
పూర్తిగా ...

నిశ్చలగీతం వినిపిస్తోంది
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,  05-08-2013
పగళ్ళంతా పొట్టకూటికై పరిచర్యలు చేసి చేసి
రాత్రిళ్ళు రహస్య సుఖాల పరిష్వంగంలో అలసి సొలసి
ఆదమరచిన నా అస్తిత్వాన్ని
అలలు అలలుగా తట్టి లేపుతూ
నిశ్చలగీతం వినిపిస్తోంది
నిద్రిత మనోసీమలలో
పూర్తిగా ...